ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రధాని నరేంద్ర మోడీ
–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ సలాం ప్రొద్దుటూరు (కడప): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు. కడపలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ యువత, విద్యార్థుల ముందు నియంతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం తల వంచక తప్పలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో...