–నీట్ పేపర్ లీకేజీ పై రాష్ట్రంలోని టీడీపీ,జనసేన పార్టీలు ఎందుకు మాట్లాడారు.
–విద్యా సంస్థల బంద్ విజయవంతం.
– SFI జిల్లా సహాయ కార్యదర్శి హరి బాబు
సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ పై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజినామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని డిల్లీ లో విద్యార్థుల పై లాఠీ ఛార్జీని ఖండిస్తూ విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల రాష్ట్ర బంద్ పిలుపు మేరకు శుక్రవారం జమ్మలమడుగులో బంద్ విజయవంతం అయ్యిందని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, SFI జిల్లా సహాయ కార్యదర్శి హరిబాబు తెలిపారు.పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది అన్నారు.బీజేపీ ప్రభుత్వం హయంలో వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నా కేంద్రం చర్యలు చేపట్టడంలో విఫలం చెందుతుంది.ఇది లీకేజీల ప్రభుత్వమని,అసమర్థత ప్రభుత్వమని,బాధ్యతారాహిత్య ప్రభుత్వమని మండిపడ్డారు.కేంద్ర విద్యా శాఖ మంత్రితో మోదీ ఇందుకు రాజీనామా చేయించడం లేదని అన్నారు.దిల్లీలో విద్యార్థుల పై బీజేపీ ప్రభుత్వం దమనకాండ ను ప్రదర్శించి బలం నిరూపించుకోవాలని విచక్షణారహితంగా లాటించార్జ్ చేపించడం దారుణమైన సంఘటన అన్నారు. ఈ చర్యను దేశం మొత్తం ఖండిస్తున్న రాష్ట్రంలోని బిజెపితో కూటమితో భాగస్వాములైన తెలుగుదేశం జనసేన పార్టీలు కనీసం స్పందించుకోవడం దారుణం అన్నారు. పేపర్ లీకేజీలపై చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బందుకు పిలుపునిస్తే ప్రభుత్వం బంధుని విచ్ఛిన్నం చేయాలని పోలీసులతో విద్యాశాఖ అధికారులకు విద్యార్థి సంఘ నాయకులకు నోటీసులు ఇచ్చి విఫలం చేయాలని కోటిల ప్రయత్నం పండిందని కానీ రాష్ట్రంలో లక్షల మంది మద్దతు బందుకు సహకరించారని అన్నారు. గతంలో విద్యార్థుల యువకులు హక్కుల కోసం బయటికి రావాలని చంద్రబాబు నాయుడు అన్న మాటలను గుర్తు చేశారు. ఇదే లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్రలో యువతను విద్యార్థులను ప్రశ్నించాలని హక్కుల కోసం పోరాడాలని ఆరోజు ప్రగల్బాలు పలికిన మాటలు ఏమయ్యాయి అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కులను అనుగదొక్కాలని చూడడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులతో చర్చలు జరపాలని కోరారు.
సిఐటియు గౌరవాధ్యక్షులు దాసు మరియు సిఐటి జమ్ముడు పట్టణ కార్యదర్శి వినయ్ బందుకు మద్దతుగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలని నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకొని తన పారదర్శకతను నిరూపించుకోవాలని లేకుంటే భవిష్యత్తులో రాబోవు రోజులలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘ నాయకులు గోపి కృష్ణారెడ్డి అరుణ్ దస్తగిరి, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.
