–25వ వార్డులో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలోని 25వ వార్డు మట్టి మస్జీద్ మునిసిపల్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ మైనారిటీ నాయకుడు నూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులతో మమేకమైన నూరి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఏ విధంగా ఉపయోగపడుతోందో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
పథకం ద్వారా తమ పిల్లల చదువుకు ఆర్థికంగా ఎంతో తోడ్పాటు లభిస్తోందని తల్లిదండ్రులు పేర్కొంటూ, ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీఆర్‌వో ఆంజనేయులు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
