SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:27 pm Posted by : SALAM PRODDATUR

తల్లికి వందనం’తో పిల్లల విద్యకు ఆర్థిక భరోసా

 

 

–25వ వార్డులో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

 

సలాం ప్రొద్దుటూరు:

పట్టణంలోని 25వ వార్డు మట్టి మస్జీద్ మునిసిపల్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ మైనారిటీ నాయకుడు  నూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులతో మమేకమైన  నూరి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఏ విధంగా ఉపయోగపడుతోందో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

 

పథకం ద్వారా తమ పిల్లల చదువుకు ఆర్థికంగా ఎంతో తోడ్పాటు లభిస్తోందని తల్లిదండ్రులు పేర్కొంటూ, ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో వీఆర్‌వో ఆంజనేయులు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.