సలాం ప్రొద్దుటూరు:
నీట్ పేపర్ లీకేజ్ భాద్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రొద్దుటూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు బంద్ పోస్టర్స్లను SFI జిల్లా నాయకులు రాహుల్,AISF జిల్లా సహాయ కార్యదర్శి పీటర్,SFI పట్టణ కార్యదర్శి చార్లెస్ విడుదల చేశారు. ఈ బంద్ లో SFI,AISF విద్యార్ధి, యువజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయన్నారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ వివరించారు. నీట్ పేపర్ లీకేజికి ప్రభుత్వం భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని కోరుతూ, ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని గత నెల రోజులుగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. పర్యావరణ వేత్త సోనం వాంగుచుక్ నేటికి హాస్పిటల్లో ఆమరణదీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారనీ తెలిపారు. 20వ తేదీ లక్షలాది మంది విద్యార్థుల శాంతి యూతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారు. విద్యార్థి, యువతపైన అత్యంత అమానవీయంగా లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ఉపయోగించి వేలాది మంది విద్యార్థులపై ఢిల్లీ పోలీస్లు కఠినంగా వ్యవహరించారు,ఒక విద్యార్థిని చనిపోవడం జరిగింది, విద్యార్థుల ప్రజాస్వామ్యంను కాపాడాలని, దేశ విద్యావ్యవస్థలో సమూలమార్పులు కావాలని, నీట్ పరీక్షా విధానం రద్దుచేసి రాష్ట్రాల వారిగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలిని కొరుతూ, నీట్ తదితర పరీక్షా పత్రాల లీకేజ్ ప్రభుత్వం నైతిక భాద్యత వహించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు మన ప్రొద్దుటూరు లో ఉన్న పాఠశాలలు,కళాశాలలు,కోచింగ్ సెంటర్లు సంపూర్ణగా బంద్ కు,సహకరించాలిని వారు కోరారు.ఈ కార్యక్రమంలో SFI నాయకులు ప్రణయ్ ,హర్ష, నాని ,మధు AISF నాయకులు అభి తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదములతో.
SFI – AISF విద్యార్థి, యువజన సంఘాలు
