ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి, పలువురికి గాయాలు..

కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి, పలువురికి గాయాలు..

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కమలాపురం):

కడప జిల్లా కమలాపురం మండలం పరిధిలోని పందిళ్లపల్లె–గొల్లపల్లె గ్రామాల మధ్య కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై బుధవారం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడిన ఘటన విషాదానికి దారితీసింది.

ఆటోలో దాదాపు 16 మంది కూలీలు ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. వీరంతా ఖాజీపేట మండలం తొడమలదిన్నె గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

 

క్షతగాత్రులను ప్రొద్దుటూరు, కడప రిమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ కొండమ్మ అనే మహిళ మృతి చెందడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.

 

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!