కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి, పలువురికి గాయాలు..

సలాం ప్రొద్దుటూరు (కమలాపురం): కడప జిల్లా కమలాపురం మండలం పరిధిలోని పందిళ్లపల్లె–గొల్లపల్లె గ్రామాల మధ్య కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై బుధవారం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడిన ఘటన విషాదానికి దారితీసింది. ఆటోలో దాదాపు 16 మంది కూలీలు ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. వీరంతా ఖాజీపేట మండలం తొడమలదిన్నె గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.   క్షతగాత్రులను ప్రొద్దుటూరు, కడప రిమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ...