ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి బంధువులు ముందుకు రావాలని ఆసుపత్రి అధికారులు, అవుట్‌పోస్ట్ పోలీసులు  కోరారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం, నరసింహ అనే వ్యక్తి ఈ నెల 19వ తేదీ రాత్రి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆయన పూర్తి వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.మృతుడు నరసింహకు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు లేదా ఆయనను గుర్తించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను లేదా ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతుడికి సంబంధించిన వివరాలను నిర్ధారించి తదుపరి చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉన్నందున సంబంధిత వ్యక్తులు వీలైనంత త్వరగా స్పందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!