సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరు మండల పరిధిలో సమాచార హక్కు చట్టం 2005,ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో,గ్రామ పంచాయితీ కార్యాలయాలలో పూర్తి స్థాయిలో RTI సంచిక బోర్డులు, సిటీజన్ చార్ట్ బోర్డులు ఏర్పాట్లు చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆర్ సి పి డివిజన్ కార్యదర్శి ఎస్ ఎం షరీఫ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలంలో సమాచార హక్కు చట్టం – 2005, అమలు పరచాలని సెక్షన్ 3 ప్రకారం ప్రతి భారత పౌరునికి ప్రభుత్వ సమాచారం పొందే హక్కు ఉందని అన్నారు. ప్రొద్దుటూరు మండలం పరిధిలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో RTI సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మరియు ప్రతి ప్రభుత్వ కార్యాలయములలో సెక్షన్ 4(1)(బి)కి సంబంధించిన 17 అంశముల సమాచారం ప్రతి దరఖాస్తుదారులకు తెలుగు భాషలో ముద్రించి స్వచ్ఛందంగా ఇచ్చుటట్లు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో పూర్తి సమచారం ఇచ్చేందుకు , పౌర సమాచార అధికారులు జాప్యం చేస్తే సెక్షన్ 7(6) ప్రకారం ఉచితంగా పూర్తి సమచారం ఇవ్వాలని అయన అన్నారు. సెక్షన్ 26 ప్రకారం సమాచార హక్కు చట్టం 2005 గురించి ప్రజలకు అవగాహన కార్యకమాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు . ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో RTI సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని RTI దరగాస్తులు స్వీకరించే క్రమంలో ప్రత్యేకంగా రిజిస్టర్-1, 2లు నిర్వహించేటట్లు చేయాలని కోరారు .ప్రతి కార్యాలయంలో RTI దరఖాస్తులు పెండింగ్ లేకుండా ప్రతి నెల ప్రభుత్వ కార్యాలయంలు తనిఖీ చేసి సమాచార హక్కు చట్టం 2005 పకడ్బాందిగా అమలు జరిగేటట్లు పర్యవేక్షించాలని అయన తహసిల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో RCP నాయకులు యోవాన్, అనిల్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.
