ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరులో.. "పసుపు పండగ"

ప్రొద్దుటూరులో.. “పసుపు పండగ”

📰 Generate e-Paper Clip

 

 

–జల్‌ జీవన్‌ మిషన్‌–2.0 ‘అమరజీవి జలధార’కు శ్రీకారం..

–జనసందోహంతో కోలాహలంగా బొల్లవరం

 

సలాం ప్రొద్దుటూరు:

₹30,156 కోట్ల తో  జల్   జీవన్‌ మిషన్‌–2.0 ‘అమరజీవి జలధార’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రొద్దుటూరు వేదిక కావడంతో పట్టణ శివారులోని బొల్లవరం ప్రాంతం జనసందోహంతో కోలాహలంగా మారింది. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం పరిసరాలు సందడిగా మారాయి.ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, వాహనాల సందడితో బొల్లవరం ప్రాంతం కళకళలాడింది.సభకు తరలివచ్చిన ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సులు, కార్ల పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు.ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బంది సేవలు అందించారు. సభా ప్రాంగణంలో భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు.మహిళలు, యువత, వృద్ధులు సహా వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలతో పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.మొత్తంగా సీఎం పర్యటన సందర్భంగా ప్రొద్దుటూరులో కనిపించిన జనసందోహం, పసుపు జెండాల సందడి, వాహనాల రాకపోకలు, సభా ప్రాంగణంలోని ఏర్పాట్లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!