ప్రొద్దుటూరులో.. “పసుపు పండగ”
–జల్ జీవన్ మిషన్–2.0 ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. –జనసందోహంతో కోలాహలంగా బొల్లవరం సలాం ప్రొద్దుటూరు: ₹30,156 కోట్ల తో జల్ జీవన్ మిషన్–2.0 ‘అమరజీవి జలధార’ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రొద్దుటూరు వేదిక కావడంతో పట్టణ శివారులోని బొల్లవరం ప్రాంతం జనసందోహంతో కోలాహలంగా మారింది. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. దీంతో...