ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చెత్త కనిపిస్తే క్షణాల్లో క్లీన్‌.. ‘లైవ్ శానిటేషన్’

చెత్త కనిపిస్తే క్షణాల్లో క్లీన్‌.. ‘లైవ్ శానిటేషన్’

📰 Generate e-Paper Clip

 

 

–సీఎం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు

 

–750 మంది కార్మికులతో పట్టణవ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ

 

– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

 

సలాం  ప్రొద్దుటూరు:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీఎం పర్యటన సందర్భంగా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రొద్దుటూరులో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ‘లైవ్ శానిటేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. సభా ప్రాంగణం, వీఐపీ ప్రాంతాలు, ముఖ్యమైన మార్గాలు, ఇతర కీలక ప్రాంతాల్లో ఎక్కడైనా చెత్త కనిపించిన వెంటనే పారిశుధ్య సిబ్బంది స్పందించి క్షణాల్లో చెత్తను తొలగించేలా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

 

200 మంది కార్మికులు.. 50 మంది సిబ్బంది

 

‘లైవ్ శానిటేషన్’ కోసం ప్రత్యేకంగా 200 మంది పారిశుధ్య కార్మికులు, 50 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు. నిర్దేశిత ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేలా విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.ఆదివారం తన కార్యాలయంలో శానిటేషన్ సెక్రటరీలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్.. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన పారిశుధ్య చర్యలు, సిబ్బంది విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ప్రాంతంలో చెత్త పేరుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

 

పట్టణవ్యాప్తంగా పారిశుధ్య చర్యలు

 

సీఎం పర్యటన జరిగే ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రొద్దుటూరు పట్టణం మొత్తం పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలిపారు. పట్టణవ్యాప్తంగా సుమారు 750 మంది పారిశుధ్య కార్మికులు విధుల్లో సిద్ధంగా ఉన్నారని చెప్పారు.పర్యటన సమయంలో ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!