–మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నివాళులు
సలాం ప్రొద్దుటూరు:
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. సత్యం, అహింసా సిద్ధాంతాలను గాంధీజీ ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నేటి తరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, రాజుపాలెం మండల మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, నాయకులు ఈ.వి. సుధాకర్‌రెడ్డి, రామాంజనేయులు, మురళీధర్‌రెడ్డి, వెంకటకొండయ్య, రమణ, నాగరాజు తదితరులు పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

