సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్‌లో ఖాళీగా ఏర్పడిన స్థానాలకు కో-ఆప్షన్ ప్రక్రియను తాలూకా అధ్యక్షులు, జేఏసీ ఛైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పలువురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి కడప జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు బి. శ్రీనివాసులు, కార్యదర్శి నిత్య పూజయ్య గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్ వ్యవహరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉద్యోగుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణకు కృషి చేయడంతో పాటు సంఘ ప్రతిష్ఠను కాపాడాలని సూచించారు. సంఘ అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
‘ఎన్జీవోస్ అసోసియేషన్ ఒక ఉప్పెన లాంటిది’
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ, “ఎన్జీవోస్ అసోసియేషన్ ఒక ఉప్పెన లాంటిది. సంఘం పోరాటాలకు పిలుపునిచ్చినప్పుడు నాయకులు ముందుండి నడిపించాలి” అని అన్నారు.ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవోస్ అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్ చురుకుగా పనిచేస్తున్నారని కమిషనర్ అభినందించారు. ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్జీవోస్ అధ్యక్షుడితో కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులకు సన్మానం
కో-ఆప్షన్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికైన అసోసియేటెడ్ ప్రెసిడెంట్ నాగార్జున, వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరయ్య, జాయింట్ సెక్రటరీ గంగాదేవి, స్టేట్ కౌన్సిలర్ కిరణ్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్ సన్మానించారు. కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను జిల్లా అధ్యక్షులు శాలువా, పూలమాలతో సత్కరించారు.కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ పద్మనాభయ్య, హెరామియా తాలూకా కార్యదర్శి ఇ. ప్రమీల, కోశాధికారి సదాశివయ్య, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ నాగార్జున, వైస్ ప్రెసిడెంట్ పి.ఐ. సంధ్యారాణి, వరప్రసాద్, మహేశ్వరయ్య, జాయింట్ సెక్రటరీ సుజాత, సుబ్బారాయుడు, నారాయణరాజు, గంగాదేవి, డీఈసీ సభ్యులు సాదిక్ సాహెబ్, నరసింహ, స్టేట్ కౌన్సిలర్ కిరణ్ తదితరులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

