వార్డుల వారీగా జనసేన కసరత్తు.. ఆశావహుల నుంచి వినతుల స్వీకరణ

  –ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి.. –కూటమి సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ   సలాం  ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ ఉమ్మడి కడప జిల్లా ఇన్‌చార్జిగా వచ్చిన దేవ వరప్రసాద్ ప్రొద్దుటూరులో పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆశావహులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని వార్డుల వారీగా పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు,...