
–కడప విమానాశ్రయంలో రామ్మోహన్ నాయుడుకు టీడీపీ నేతల ఆత్మీయ స్వాగతం
సలాం ప్రొద్దుటూరు –కడప
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కడప విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితమ్మతో కలిసి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి జబివుల్లా కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. టీడీపీ సీనియర్ నాయకులు పుత్త నరసింహారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేంద్ర మంత్రితో ఆత్మీయంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కడప విమానాశ్రయ అభివృద్ధి, విమానయాన సదుపాయాల విస్తరణకు సంబంధించిన అంశాలు ఈ పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు హరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

