ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్భక్తిశ్రద్ధల మధ్య శ్రీ అగస్త్యేశ్వర స్వామి–అమ్మవార్ల మిరవరి

భక్తిశ్రద్ధల మధ్య శ్రీ అగస్త్యేశ్వర స్వామి–అమ్మవార్ల మిరవరి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం స్వామి, అమ్మవార్ల మిరవరి భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఆలయ అంతర్భాగంలో మిరవరి కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.వి. రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొని స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది కార్యక్రమాన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!