–గేట్లు ఫెయిల్ కావడంతో నిలిచిన నీటి విడుదల
– త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు:
శెట్టివారిపల్లి చెరువుకు నీరు మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏకర్లపాలెం SR-2 డ్యామ్ కాలువ నుంచి SR-1 CMP కాలువను అనుసంధానించే వంక ద్వారా శెట్టివారిపల్లి చెరువుకు నీరు చేరేలా పనులు చేపట్టారు.
SR-2 నుంచి చెరువుకు నీటిని విడుదల చేసి చెరువును నింపేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ, గేట్లు పనిచేయకపోవడంతో నీటి విడుదలకు ఆటంకం ఏర్పడింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఈ విషయాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గేట్లను త్వరితగతిన మరమ్మతులు చేయించి, నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే చొరవతో గేట్ల మరమ్మతులు పూర్తయి శెట్టివారిపల్లి చెరువుకు నీరు చేరితే ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య కొంతమేర పరిష్కారం కానుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

