ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు

అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

–విశేష పూజలు, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో హోమాలు

 

సలాం ప్రొద్దుటూరు:

శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రాతఃకాలం నుంచే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రత్యేకంగా గోపూజ, గణపతి పూజ, నవగ్రహ, ఉపగ్రహ, ఉపదేవత పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం ఆయుష్య, మృత్యుంజయ, మన్యు, సుదర్శన, శ్రీసూక్త, మహాలక్ష్మీ హోమాలను అర్చక స్వాముల బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించింది. హోమ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయ ఈఓ కే.వి. రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాముల బృందం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించింది.శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల శ్రేయస్సు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!