ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం తో.. ఎమ్మెల్యే ధర్నా విరమణ

సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం తో.. ఎమ్మెల్యే ధర్నా విరమణ

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

శ్రీనివాసనగర్‌లో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం తో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ధర్నా నిర్ణయాన్ని విరమించినట్లు తెలిపారు. శనివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీనివాసనగర్‌లో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భూమి వివాదంతో పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం కోర్టు తీర్పుతో 2.49 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా నిర్ధారణ కావడంతో పనులకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.అధికారులు, కలెక్టర్ సోమవారం నుంచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సహకరించిన అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాష మాట్లాడుతూ, సబ్‌స్టేషన్‌కు సంబంధించిన మిగిలిన 20 శాతం పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అవసరమైన అనుమతులు పూర్తికాగానే పరికరాలు తరలించి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ముక్తియార్, తోట మహేశ్వర రెడ్డి, ఈవీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!