సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం తో.. ఎమ్మెల్యే ధర్నా విరమణ
సలాం ప్రొద్దుటూరు: శ్రీనివాసనగర్‌లో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం తో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ధర్నా నిర్ణయాన్ని విరమించినట్లు తెలిపారు. శనివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీనివాసనగర్‌లో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భూమి వివాదంతో పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం కోర్టు తీర్పుతో 2.49 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా నిర్ధారణ కావడంతో పనులకు...