ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్1302 మంది లబ్ధిదారులకు ₹11 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి - ఎమ్మెల్యే వరద 

1302 మంది లబ్ధిదారులకు ₹11 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి – ఎమ్మెల్యే వరద 

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

 

రాష్ట్రంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం 2 వ స్థానంలో ఉందని నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1302 మంది లబ్ధిదారులకు సుమారు ₹11 కోట్ల 34 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు లబ్ధి   చేకూరిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం నియోజకవర్గానికి సంబంధించిన 29 వ విడత లో భాగంగా 61 మంది లబ్ధిదారులకు ₹ 55.36 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలవడమే మన ప్రభుత్వ లక్ష్యం అని ఆరోగ్య,ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన అన్నారు.పేద మధ్యతరగతి వర్గాలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే మన కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అన్నారు.ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలందరికీ అండగా ఉంటాం అన్నారు.పేదల ఆరోగ్యం,సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందనీ ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు , టి డి పి కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు , టి డి పి పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ,మాజీ పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి , టి ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్ ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య ,మాజీ కౌన్సిలర్లు ఎర్రన్న,జిలాన్,కమాల్ బాషా,గఫార్,మాడెం సుధాకర్ రెడ్డి,సింగరయ్య,షఫీ,రేగల్ల పల్లె భాస్కర్ రెడ్డి,పల్లేటి రాముడు,కొండారెడ్డి (పెద్దమనిషి),శీను,పిట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!