ePaper
Friday, July 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎంపీడీఓల పనితీరు మెరుగుపడాలి

ఎంపీడీఓల పనితీరు మెరుగుపడాలి

📰 Generate e-Paper Clip

 

 

లేదంటే చర్యలు తప్పవు

 

గ్రామ పంచాయతీ అభివృద్ధిపై ఎంపీడీఓ లకు శిక్షణ వేదికపై సీఈఓ విజయలక్ష్మి హెచ్చరిక

 

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):

అనంతపురంలోని డీ.పీ.ఆర్.సీ లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఎంపీడీఓలు హాజరయ్యారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్రణాళిక రూపకల్పనపై ఒక రోజు శిక్షణను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కలెక్టర్ నిర్వహించే వీసీలను కొందరు ఎంపీడీఓ లు ఆషామాషిగా తీసుకుంటున్నారని సీఈఓ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే కుందుర్పి ఎంపీడీఓపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. మిగిలిన ఎంపీడీఓలు కూడా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. చాలా మంది ఎంపీడీఓలు ఫీల్డ్ కు వెళ్ళడమే లేదని తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఉన్నతాధికారుల ఆలోచనలకు అనుగుణంగా పని చేయని ఎంపీడీఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  డిపీఓ నాగరాజా నాయుడు, సీనియర్ ఎంపీడీఓలు కొండన్న, తేజ్యోష్ణ, ఇతర అధికారులు వేదికపై ఆశీనులయ్యారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!