సలాం ప్రొద్దుటూరు (తెలంగాణ):
తెలంగాణలో ఓ భారీ అవినీతి తిమింగలం బయటపడింది. R&B ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా బంగారం మరియు నగదు గుర్తించారు. 15 బంగారం బిస్కట్లు, కళ్ళు చెదిరిపోయే బంగారు ఆభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లు, డబ్బుల కట్టలు, భారీ వెండి సామాగ్రి, ఆస్తి పత్రాలు లభించాయి. హైదరాబాద్ – నిజామాబాద్ ప్రాంతాల్లో లెక్కకు మించి ఆస్తులు బయటపడుతున్నాయి. మొత్తంగా 15 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ఇప్పటివరకూ 100 కోట్ల ఆస్తులకు పైగానే గుర్తించారు…
