సలాం ప్రొద్దుటూరు :
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని వెన్నుపోటు కు రెండేళ్లు అయిందని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందర ఉన్న గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు, మహిళలు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో మరియు సూపర్ సిక్స్ బాండ్ పత్రాలు చించేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నా పార్టీకి ఓటు వేయండి నన్ను గెలిపించండి నేను అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు నుంచి 59 సంవత్సరాల వయస్సు మహిళలకు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 1500 రూపాయలు ప్రతినెల ఒకటో తేదీ అకౌంట్లో జమ చేస్తా అని బాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అలాగే చంద్రబాబు ఇంకా హాస్యంగా ఇంట్లో ముగ్గురు ఉన్నా పర్వాలేదూ నలుగురు ఉన్న పర్వాలేదూ ఓపిక ఉంటే ఇంకా తినండి వారికి కూడా ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. అక్క చెల్లెమ్మల తరఫునుంచి తాము దీనిపై ప్రశ్నిస్తున్నామన్నారు. రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుంటే ఇది మోసం కాదా చంద్రబాబు అని సూటిగా ప్రశ్నించారు. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం వారికి 4000 వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చేసిన వాగ్దానం గుర్తు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం లో 50 సంవత్సరాల నిండిన వారు కొన్ని వేల మంది మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు. వీరిలో ఒక్కరికైనా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చావా అని ఘాటుగా ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ ఇచ్చి ఉంటే నెలకు 4000 రూపాయలు చొప్పున 2 సంవత్సరానికి 96,000 వేల రూపాయలు అవుతుందన్నారు. ఒక లబ్ధిదారులకు 96 వేల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసిన బాబుకు ఎందుకు 420 కేస్ నమోదు చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చావా ? కొత్త పెన్షన్ ఇవ్వకపోగా రెండు సంవత్సరాల్లో 6 లక్షల పెన్షన్లు వివిధ కారణాలతో తొలగించారని ఇది అన్యాయం కాదా? మోసం కాదా? అని ఆయన ప్రశ్నించారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగం వచ్చేంతవరకు నిరుద్యోగ భృతి కింద ప్రతినెల 3 వేల రూపాయలు ఇస్తానని చెప్పారని ఇంతవరకు ఎవరికైనా ఇచ్చావా బాబు అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలకు 72 వేల రూపాయలు అవుతుందని ఇది ఎగర కొట్టడం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చినావా అని మండిపడ్డారు. 48 సంవత్సరాలు నిండిన మహిళలకు సంవత్సరానికి 18500 రూపాయలు ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిందని ఇది అన్యాయం కాదని పాపమని పేదవారీ ఉసురు తగులుతుందని ఆయన దుయ్యబట్టారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కుటుంబ ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల కళాశాల యాజమాన్యం విద్యార్థులకు వారి ఇండ్లకు పంపిస్తున్నారని దీంతో వారు చదువు మధ్యలోనే ఆగిపోతుందని విద్యార్థుల ఆశలు బంగారు భవిష్యత్తు ఆవిరి ఐతుందనీ ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల తో ముడిపడిందనీ ప్రభుత్వం వారి జీవితం తో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం, వారి గురించి ప్రశ్నించేందుకు తమకు జైల్లో పెట్టిన భయపడమని ఆయన చెప్పారు. కరెంట్ బిల్ పెంచామని చెప్పిన ప్రభుత్వం మూడు నెలలకే పెంచడం ఏందని ప్రశ్నించారు. 24 వేల కోట్ల రూపాయలు పేద ప్రజల పై ఎండాకాలంలో భారం వేసారని మండిపడ్డారు. నిత్యవసర ధరలు పెంచమని చెప్పి ఉప్పు నుంచి పప్పు వరకు అన్ని పెంచారన్నారు. ధరలు ఆకాశం అంటుతున్నాయి పేదలు పట్టెడు అన్నం కోసం అల్లాడుతున్నారని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు.
