వర్షంతో పులకించిన ప్రొద్దుటూరు..

  –జలమయమైన వీధులు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ప్రజలను వర్షం పలకరించింది. కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు జల్లులతో ఆనందం వ్యక్తం చేశారు.ఎల్‌నినో ప్రభావంతో గత కొన్ని రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. దీంతో ఉక్కపోత తీవ్రత పెరిగి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.అయితే...