ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తాం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తాం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం ):

జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో ఐ.అండ్.పీఆర్ (జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ) ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ 2వ సమావేశాన్ని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ మంజూరు చేసిన అక్రిడిటేషన్ కార్డులలో నిబంధనల ప్రకారం ఏవైనా అభ్యంతరాలు ఉంటే సభ్యులు కమిటీ దృష్టికి తీసుకురావడం చేయాలని, దానిపై విచారించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్ కు 5 రోజుల ముందు ప్రిపరేటరీ మీటింగ్ ను సభ్యులతో నిర్వహించాలని ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ మరియు డిఎంఏసి మెంబర్ కన్వీనర్ కు సూచించారు. అక్రిడిటేషన్ కొనసాగాలంటే పేపర్ల రెగ్యులారిటీ ఖచ్చితంగా ఉండాలని, లేకపోతే తొలగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో జిల్లాలో రెండవ విడతగా 97 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఇందులోభాగంగా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఆలోచించి అర్హత కలిగిన వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరగా, క్రమం తప్పకుండా పత్రికలు, పీరియాడికల్స్ డిఐపిఆర్ఓ కార్యాలయానికి అందచేయాలని, నిజాయితీగా ఉండే వాళ్లకి, ఎలాంటి తప్పులు చేయని వారికి నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ మరియు డిఎంఏసి మెంబర్ కన్వీనర్ ఏ.బాలకొండయ్య, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఎస్.మహమ్మద్ అయుఫ్, ఏ.షఫీఉల్లా, సి.రవికుమార్, సి.ప్రతాప్, కె.అనిల్ కుమార్ రెడ్డి, కె.మల్లికార్జునరావు, ఎస్ఎండి.రసూల్, ఆర్.రామంజినేయులు, ఆర్విఎస్.ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, లేబర్ కార్యాలయం ఏసీఎల్ లావణ్య, గృహ నిర్మాణ శాఖ అధికారి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, ఐ.అండ్.పీఆర్ ఏపీఆర్ఓ ఫక్రుద్దీన్, పిఆర్ఓ వి.సూర్యనారాయణ రెడ్డి, టైపిస్ట్ దామోదర్ రెడ్డి, టెక్నీషియన్ కమల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!