సలాం ప్రొద్దుటూరు:
ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ను మంగళవారం AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. V.S. ముక్తియార్ సందర్శించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఉన్న వసతులు, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.
అలాగే క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందిస్తున్నందుకు సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా ప్రతి అంశంలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు నామమాత్రపు ధరకు నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు పట్టణ ఉపాధ్యక్షులు కె. ఖలీల్ భాషా పాల్గొన్నారు
