ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి దర్గాలో ఘనంగా 11వీ షరీఫ్

హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి దర్గాలో ఘనంగా 11వీ షరీఫ్

📰 Generate e-Paper Clip

 

_భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు.. 500 మందికి పైగా అన్నదానం

 

సలాం  ప్రొద్దుటూరు:

స్థానిక హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి స్వామి దర్గా వద్ద ఆదివారం 11వీ షరీఫ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు, చదవింపులు నిర్వహించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రొద్దుటూరు ఆస్థానే కమలియా స్వామి హజరత్ సయ్యద్ షా డా. అరిఫుల్లా హుస్సేనీ ఖాద్రి  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు చదవింపులు చేశారు. ఈ సందర్భంగా దస్తగిరి స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని దువా చేశారు.హజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదీర్ జిలానీ (రహ్మతుల్లాహి అలైహి) (దస్తగిరి స్వామి) చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన సూచించారు. దస్తగిరి స్వామి జీవితం మానవాళికి ఆదర్శప్రాయమని, ఆయన బోధనలు ప్రేమ, సేవ, సోదరభావాన్ని పెంపొందించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

 

500 మందికి పైగా అన్నదానం

 

దస్తగిరి స్వామి నెల సందర్భంగా దర్గా మస్జిద్ ముసల్లీలు, భక్తుల సహకారంతో 500 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. భక్తులు, ముసల్లీలు, నిర్వాహకులు సమన్వయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా భోజనం అందించారు.ఈ సందర్భంగా దర్గా ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ముసల్లీలు, భక్తులు, నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!