–అకీదత్, అదబ్తో పర్చమ్కుషాయి..
–దేశ శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక దువా
సలాం ప్రొద్దుటూరు – కడప:
నగరంలోని మాసాపేటలో నిర్మలా స్కూల్ ఎదురుగా ఉన్న ఖాన్ఖా-ఏ-ఖాద్రియా హుస్సేనియా మకాన్లో 11 వి షరీఫ్ ముబారక్ కార్యక్రమాన్ని ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా అత్యంత అకీదత్, అదబ్, ఆధ్యాత్మిక భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పర్చమ్కుషాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో అకీదత్మందులు పాల్గొన్నారు.హజ్రత్ గౌస్-ఏ-ఆజమ్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహ్మతుల్లాహి అలైహ్ జ్ఞాపకార్థం నిర్వహించే 11వి షరీఫ్ సందర్భంగా ప్రత్యేక ఫాతిహా, దువా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర పర్చమ్ను బులంద్ చేసి, అనంతరం దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత, ప్రజల సుఖసంతోషాలు నెలకొనాలని ప్రత్యేక దువా చేశారు.
ఈ సందర్భంగా ఆస్థాన పీఠాధిపతులు మాట్లాడుతూ..పవిత్ర 11వి షరీఫ్ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌస్-ఏ-ఆజమ్ వారి ఆధ్యాత్మిక బోధనలు, ప్రేమ, మానవత్వం, సోదరభావం వంటి విలువలను ప్రజలకు గుర్తుచేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.పర్చమ్కుషాయి కార్యక్రమంలో చిన్నారులు, యువత, పెద్దలు సహా పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హాజరైన వారికి తబర్రుక్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ షా ఆరిఫ్ పాషా సాహెబ్, సయ్యద్ షా ఆజం పాషా సాహెబ్, సయ్యద్ ఇమ్రాన్ సాహెబ్ తదితరులు పాల్గొనగా, ఉలమా, మషాయిఖ్, మత పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
