ePaper
Friday, September 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్జగనన్న ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి

జగనన్న ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి

📰 Generate e-Paper Clip

 

 

–లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలి లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

 

–మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన – సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ

 

సలాం ప్రొద్దుటూరు :

జగనన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టి పేదలకు సొంత గూడు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. సుమారు ఆరు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 18 వేల మంది పేదలకు సెంటు చొప్పున స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చిందని తెలిపారు. అయితే ఇప్పటికీ అనేక మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం జరగలేదని అన్నారు.ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి పేదల నుంచి రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు డబ్బులు వసూలు చేశారని, అయినప్పటికీ ఇళ్లు నిర్మించలేదని ఆరోపించారు. దీంతో పేదలు అప్పులకు వడ్డీలు చెల్లించలేక, మరోవైపు అద్దె ఇళ్ల భారాన్ని భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

రూ.5 లక్షల హామీ ఏమైంది?

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని, లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సెంటు స్థలం గానీ, ఒక్క రూపాయి ఆర్థిక సహాయం గానీ అందలేదని అన్నారు.ప్రభుత్వం వెంటనే జగనన్న ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని, లబ్ధిదారుల నుంచి గతంలో వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని లేదా ఇళ్లను నిర్మించి పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే లబ్ధిదారులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సత్యనారాయణ హెచ్చరించారు.ఈ ఆందోళనలో సీఐటీయూ కార్యదర్శి బి. విజయకుమార్, లబ్ధిదారులు సాల్మన్, పకీరయ్య, సామయ్య, ఏసు, శాంతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!