ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రోడ్డుపై ఇష్టారాజ్య పార్కింగ్‌కు చెక్‌.. గాలి తీసిన కమిషనర్!

రోడ్డుపై ఇష్టారాజ్య పార్కింగ్‌కు చెక్‌.. గాలి తీసిన కమిషనర్!

📰 Generate e-Paper Clip

 

సలాం  ప్రొద్దుటూరు:

పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా రోడ్లపై, ప్రధాన కూడళ్ల వద్ద ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపే వారిపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కఠిన చర్యలు చేపట్టారు.

 

ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా రహదారులను ఆక్రమించి పార్కింగ్‌ చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ప్రధాన రహదారిలో అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాల టైర్లలోని గాలిని కమిషనర్ స్వయంగా దగ్గరుండి తీయించారు.

 

రోడ్లపై వాహనాలను అడ్డంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని వాహనదారులకు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!