సలాం ప్రొద్దుటూరు –కర్నూలు:
ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూలూస్కు సంబంధించిన పోస్టర్లను స్థానిక హజరత్ సయ్యద్ షా అబ్దుల్ లతీఫ్ ఖాద్రి అల్ హమావి దర్గా ప్రాంగణం లో మిలాద్ కమిటీఅధ్యక్షులు సయ్యద్ షఫీ పాషా ఖాద్రి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ జూలూస్ను విజయవంతం చేసేందుకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో IUML పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సయ్యద్ షోయబ్ ఖాద్రీ, మిలాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
