ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజల గడపకు పాలన.. ప్రజల మాటే బలం

ప్రజల గడపకు పాలన.. ప్రజల మాటే బలం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 25వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వై.ఎస్. మొహమ్మద్ గౌస్ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే డోర్‌-టు-డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. ప్రజల విశ్వాసమే తమకు బలమని, ప్రొద్దుటూరు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లాభక్ష్, మాఫిర్, గౌస్ పీర్, ఖలందర్ ఇలియాస్, మహబూబ్ హుస్సేన్, నూర్ ఫటాన్, నాగేంద్ర, ఆరిఫ్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!