ప్రజల గడపకు పాలన.. ప్రజల మాటే బలం
సలాం ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 25వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వై.ఎస్. మొహమ్మద్ గౌస్ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి...