ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeజాతియంజంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన AIFB జాతీయ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్

జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన AIFB జాతీయ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (న్యూఢిల్లీ):

NEET పేపర్ లీక్, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జాతీయ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను ప్రభుత్వం నిర్ధారించాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని ఆయన కోరారు.

 

నిరసన కార్యక్రమంలో AISB మరియు AIYL ఢిల్లీ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కును ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, విద్యార్థుల సమస్యలను అణచివేయకుండా ప్రభుత్వం పరిష్కార మార్గాలను అన్వేషించాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

నిరసనలో పాల్గొన్న నాయకులు విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!