జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన AIFB జాతీయ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్
సలాం ప్రొద్దుటూరు (న్యూఢిల్లీ): NEET పేపర్ లీక్, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జాతీయ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను ప్రభుత్వం నిర్ధారించాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని ఆయన కోరారు....