ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక అదృశ్యం..

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక అదృశ్యం..

📰 Generate e-Paper Clip

– వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు  1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం.. వసంతపేటకు చెందిన కొరివి ఎస్టేరు (12), తండ్రి కిరణ్, ఈ నెల 11వ తేదీ ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ప్రొద్దుటూరులోని రామేశ్వరం ప్రాంతం నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయింది. బాలిక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.బాలిక తల్లిదండ్రులు అనేక సంవత్సరాల క్రితమే ఆమెను విడిచిపెట్టడంతో, అప్పటి నుంచి అమ్మమ్మ కొరివి శాంతమ్మ (60), భర్త యేసు రత్నం వద్ద వసంతపేటలో నివాసం ఉంటోంది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, పరిచయస్తుల వద్ద గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాలిక గురించి సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా ప్రొద్దుటూరు పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!