ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి అండగా ప్రభుత్వం

ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి అండగా ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

 

–ఇళ్లులేని ఫోటోగ్రాఫర్లకు త్వరలో ఇంటి పట్టాలు

– బ్యాంకు రుణాల సదుపాయం కల్పిస్తాం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక MMT కళ్యాణ మండపంలో  ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఏఎస్పీ విభూ కృష్ణ IPS ముఖ్య అతిథులుగా హాజరై ఫోటోగ్రాఫర్లకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని చిత్రరూపంలో భద్రపరుస్తూ ప్రజలకు, సమాజానికి ఫోటోగ్రాఫర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఇళ్లులేని ఫోటోగ్రాఫర్లకు త్వరలో ఇంటి పట్టాలు అందించి, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ఫోటోగ్రాఫర్లు కోరిన మేరకు బ్యాంకు రుణాల సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.కార్యక్రమంలో సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న పలువురు స్వచ్ఛంద సేవకులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఏఎస్పీ విభూ కృష్ణ IPS, పురపాలక కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఘనంగా సన్మానించారు.ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, స్థానిక ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!