సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 22 వ వార్డులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ ఆధ్వర్యంలో బుధవారం పేదల సేవలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పెన్షన్ అందించారు.జోకపాలెం స్ట్రీట్, రాజాజీ రోడ్, రంగయ్య గారి వీధి, జామియా మస్జీద్ రోడ్, లలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అభివృద్ధి గురించి ఆయన వివరించారు. వార్డులో సమస్యలు ఉంటే తమకు తెలపాలని ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
