ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాణిపాక వరసిద్ధి వినాయకునికి కళాక్షేత్రం విద్యార్థుల నృత్య నీరాజనం

కాణిపాక వరసిద్ధి వినాయకునికి కళాక్షేత్రం విద్యార్థుల నృత్య నీరాజనం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వచంబు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ప్రొద్దుటూరుకు చెందిన కళాక్షేత్రం విద్యార్థులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు భక్తిగీతాలకు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను ప్రదర్శించి వినాయకునికి నృత్య నీరాజనం సమర్పించారు.కళాక్షేత్రం విద్యార్థులు నాట్యగురువు మోహిద్దీన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో సుమారు 30 మంది బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తమ నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. వివిధ నృత్య రూపాల్లో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలకు ఆలయ నిర్వాహకులు, భక్తుల నుంచి ప్రశంసలు లభించాయి.అనంతరం ఆలయ నిర్వాహకులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కళా సంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావాలను మేళవిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!