ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రతిభకు ప్రోత్సాహం.. 48 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.2 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్‌లు

ప్రతిభకు ప్రోత్సాహం.. 48 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.2 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్‌లు

📰 Generate e-Paper Clip

–ప్రతిభకు ప్రోత్సాహం.. 48 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.2 లక్షల మెరిట్ స్కాలర్‌షిప్‌లు

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్, కడప ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువైన మెరిట్ స్కాలర్‌షిప్‌లను సోమవారం పంపిణీ చేశారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం, చివరి సంవత్సరం చదువుతున్న 48 మంది మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందజేశారు.దివంగత వై.వి. నాయుడు కుమారులు వై. వినయ్ కుమార్, డాక్టర్ వై. రామ సంజయ్, కోడలు సి. సునీత, మనుమడు వై. సాయి వేణుగోపాల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ తండ్రి దివంగత వై.వి. నాయుడు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరైన వై. వినయ్ కుమార్ కూడా ఇదే కళాశాలలో పూర్వ విద్యార్థి అని తెలిపారు.విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా అవసరమైన వారికి విద్యాభ్యాసంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల విద్యా, వ్యక్తిగత అభివృద్ధికి తమ వంతు సహకారం కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పాలెం గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ, 48 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సుమారు రూ.2 లక్షల విలువైన మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో విద్యలో రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ఇలాంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదపడతాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులకు అందిస్తున్న సహకారానికి కళాశాల తరఫున వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులు, అధ్యాపకులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!