ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్నూతన వార్డులపై టీడీపీ శ్రేణులకు అవగాహన సదస్సు

నూతన వార్డులపై టీడీపీ శ్రేణులకు అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

 

 

–41 నుంచి 52 వార్డులుగా పునర్వ్యవస్థీకరణ..

–ఓటర్ల జాబితా మార్పులపై క్లస్టర్, వార్డు ఇన్‌చార్జీలకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి దిశానిర్దేశం

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నూతన వార్డుల వివరాలు, ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న మార్పులపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.గతంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్న 41 వార్డులను 52 వార్డులుగా పునర్వ్యవస్థీకరించడంతో వార్డుల సంఖ్యలు, పరిధుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్‌లో వెలువడిన నూతన వార్డుల జాబితా అనంతరం SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలోనూ పలు మార్పులు, చేర్పులు జరిగాయి.

 

వార్డుల పరిధులపై సమగ్ర అవగాహన

 

ఈ నేపథ్యంలో ప్రతి క్లస్టర్‌కు సంబంధించిన వార్డు ఇన్‌చార్జీలతో నిర్వహించిన సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. V.S. ముక్తియార్ పాల్గొన్నారు.నూతనంగా ఏర్పాటు చేసిన వార్డుల సంఖ్య, వాటి పరిధులు, వరుస సంఖ్యల్లో జరిగిన మార్పులు, ఓటర్ల జాబితాలో నమోదైన మార్పులు, చేర్పులు తదితర అంశాలను క్లస్టర్, వార్డు ఇన్‌చార్జీలకు వారు వివరించారు.

 

సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి

 

నూతన వార్డుల పరిధిపై నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సంబంధిత వార్డుల పరిధిలో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ, స్థానిక స్థాయిలో ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు.వార్డుల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా మార్పుల నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు కేటాయించిన ప్రాంతాల వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించారు. కొత్త వార్డుల నిర్మాణానికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సమన్వయంపై కూడా సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, వార్డు ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!