ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు.. నవయుగ వైతాళికుడు

గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు.. నవయుగ వైతాళికుడు

📰 Generate e-Paper Clip

 

 

–గొప్ప సంఘసంస్కర్తగా గురజాడ సేవలు చిరస్మరణీయం

–డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు –  వేంపల్లి:

గురజాడ అప్పారావు అభ్యుదయ కవితా పితామహుడని, నవయుగ వైతాళికుడిగా తెలుగు సమాజానికి దిశానిర్దేశం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. సోమవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అంటూ గురజాడ అందించిన అమర సందేశం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనకు ఆయన సాహిత్యాన్ని, వాడుక భాషను ఆయుధాలుగా మలిచారని పేర్కొన్నారు.గురజాడ గొప్ప మానవతావాది అని, స్త్రీ జనోద్ధరణ, సంఘ సంస్కరణ, భాషోద్యమం మూడు రంగాల్లోనూ ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమన్నారు. సమాజంలోని లోపాలను ఎత్తిచూపిన ఆయన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. గిరీశం, బుచ్చమ్మ, మధురవాణి వంటి పాత్రలు తెలుగు నాటక రంగంలో సజీవ పాత్రలుగా నిలిచాయని తెలిపారు.‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’, ‘ముత్యాల సరాలు’, ‘సుభద్ర’, ‘నీలగిరి కోటలు’ వంటి రచనలు గురజాడ సాహితీ ప్రతిభకు నిదర్శనాలని తులసిరెడ్డి పేర్కొన్నారు. గురజాడ అడుగుజాడలు సమాజ ప్రగతికి మైలురాళ్లని అన్నారు.కార్యక్రమంలో తులసిరెడ్డి సతీమణి అలివేలమ్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం, వేముల మండల శాఖ అధ్యక్షుడు చాగలేటి వెంకటేశు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!