ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

📰 Generate e-Paper Clip

–ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వార్డుల వారీగా పార్టీ బలాబలాలపై సమీక్ష

 

సలాం  ప్రొద్దుటూరు:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప పార్లమెంటు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం వార్డుల సంఖ్య, వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, స్థానికంగా జనసేన పార్టీకి ఉన్న బలం, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు తదితర అంశాలను కడప పార్లమెంటు సమన్వయకర్త దేవ వరప్రసాద్, రాజోలు ఎమ్మెల్యే గారికి వివరించారు.

అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, వార్డుల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలు, నాయకులు–కార్యకర్తల సమన్వయం తదితర విషయాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కడప పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల సహాయ బృందం సభ్యుడు అక్కిదానరి రామారావు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల వివరాలను రాజోలు ఎమ్మెల్యే, కడప పార్లమెంటు సమన్వయకర్త దేవ వరప్రసాద్‌కు వివరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, వార్డుల వారీగా పరిస్థితిని అంచనా వేసి ముందుకు సాగాలని నాయకులు సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!