–స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలి – రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత కల్పించేలా అభ్యర్థుల ఎంపిక చేశామని స్పష్టంగా సమావేశంలో వివరించారు .ప్రొద్దుటూరులోని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్వగృహంలో బుధవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిశీలకుడు పూల శ్రీనివాసులురెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ ప్రజల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.పార్టీ కమిటీ జారీ చేసిన ఐడీ కార్డు ప్రాధాన్యతను నాయకులు, కార్యకర్తలకు వివరించారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తున్నారని నాయకులు అభినందించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని, ప్రజల్లో పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా సమష్టి కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


