ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎస్‌ఐఆర్ చివరి రోజున చాపాడు మండలంలో పోలింగ్ బూత్ ల పరిశీలన

ఎస్‌ఐఆర్ చివరి రోజున చాపాడు మండలంలో పోలింగ్ బూత్ ల పరిశీలన

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (చాపాడు):

 

చాపాడు మండల కేంద్రంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం చివరి రోజున మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) రామకుమారి, డిప్యూటీ తహసీల్దార్ ఎన్.ఎల్. కృష్ణారెడ్డి 147, 148 పోలింగ్ బూత్‌లను శుక్రవారం  సందర్శించి కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, నమోదవుతున్న దరఖాస్తులు, బూత్‌లలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించి సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

 

కార్యక్రమంలో 147వ పోలింగ్ బూత్ బీఎల్‌వో సుప్రజ, 148వ పోలింగ్ బూత్ బీఎల్‌వో తేజస్విని పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్బర్ సలీమ్, మస్తాన్, షరీఫ్, కరీం, భారతీయ జనతా పార్టీ నాయకుడు లక్షుమ్మయ్య తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!