–బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించడమే సర్ లక్ష్యం ఓటర్ల సవరణపై అప్రమత్తంగా ఉండాలి
–రైతాంగ సమస్యల పరిష్కారానికి పంటల గిట్టుబాటు ధరకు జూన్ 30వ తేదీన చలో విజయవాడ
–సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
సలాం ప్రొద్దుటూరు(ఎర్రగుంట్ల):
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా సిపిఐ పార్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 15 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు.
గురువారం ఎర్రగుంట్ల లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ నేతృత్వంలో ఆగష్టు 6వ తారీకు నుంచి 15వ తేదీ లలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆగష్టు 6వ తారీకు మొదలై, ఆగష్టు 15వ తారీకు వరకు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్టు తెలిపారు .ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగిందన్నారు రూపాయి పతనం రోజురోజుకూ దిగజారి పోతుందన్నారు. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం తన యొక్క స్థానాన్ని క్రమక్రమంగా కోల్పోయేటువంటి పరిస్థితి ఒకవైపున దాపురిస్తుంది.
ఇంకోవైపున ఏమో విశ్వగురువుగా తనకు తాను ప్రకటించుకుంటూ భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రచారం చేసుకుంటున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఈరోజు పెరిగేటువంటి ధరలు ఏమాత్రం అడ్డుఅదుపు లేకుండా విపరీతంగా పెరుగుతున్న యన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు సరాఘాతంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఒకవైపున కనిపిస్తుంది. ఇంకోవైపున ఉద్యోగ కల్పన అని చెప్పేసి చాలా గొప్పగా వాగ్దానం చేశారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, కొత్త ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున ఉంది. మరొకవైపున భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ కాములంతా ఆందోళన చేస్తుంటే, భారత రాజ్యాంగాన్నే విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆదివాసులపై కానీ, గిరిజనులపై కానీ, దళితులపై కానీ, మైనారిటీలపై కానీ పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి.
నిన్న కాక మొన్న బెంగాల్ లో అధికారం చేపట్టారో లేదో, చేపట్టిన మూడో రోజుకే దాడులు పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాల పైన కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల క్రితం చర్చిల్లోకి దూరి ఈరోజు అన్య మతస్థుల పైన దాడులు చేసేటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ సమానం అన్నటువంటిది ఇది బీజేపీ పరిపాలనలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఇది దుర్లభం అని చెప్పి చెప్పడానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తామని
ఈ నేపథ్యంలోనే “సర్” పేరుతో తీసుకొచ్చిన, ఓటర్ పునర్‌వ్యవస్థీకరణ దాంట్లో భాగంగా ఈరోజు చేస్తున్నటువంటిది ఇప్పటికే దాదాపు 18 రాష్ట్రాల్లో 6.5 కోట్ల మందిని తొలగించారు. మొత్తం ఈ సర్వ్ ప్రక్రియ పూర్తయ్యేలోపు 20 కోట్ల మందిని ఓటర్లుగా తొలగించాలనే లక్ష్యంతో ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, అదేవిధంగా బీహార్ లో కానీ, అస్సాం లో కానీ, పాండిచ్చేరి కానీ ఏ రాష్ట్రంలో తీసుకున్నప్పటికీ కూడా వారికి ఎవరైతే ఓట్లు వేయరని భావించారో, అలాంటి వాళ్ళ ఓట్లను తొలగించి, పర్సంటేజ్ తగ్గించి, ఈరోజు అధికారంలోకి రావడానికి కావలసినటువంటి అన్ని రకాల దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది. ఇలా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో మా ఈ రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా మేమేమి తక్కువ తినలేదు అని చెప్పేసి ఆయన మరి నాలుగు ఆకులు ఎక్కువే తిన్నటువంటి వారిలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతుంది.
రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 1400 బస్సులను వాటి ప్రైవేటీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఆస్తులు కలిగినటువంటి ఆర్టీసీని ఈరోజు ప్రైవేటీకరించాలన్నటువంటి దుర్మార్గకరమైన ప్రయత్నం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఆర్టీసీ నే కాదు, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా లూలూ మాల్స్ వంటి కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అన్నప్పుడు అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగాలి, సమతోల్యాభివృద్ధి జరగాలి, వెనకబడ్డటువంటి ప్రాంతాలను ప్రయారిటీ కింద చేర్చాలనే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అట్లా కాకుండా కేవలం ఒకటి, రెండు అంశాలు చెప్పి దాని చుట్టే పరిభ్రమిస్తూ అభివృద్ధి అంతా కూడా కేంద్రీకరిస్తే రేపొద్దున మళ్ళీ పెచ్చరిల్లిపోయేటువంటి విచ్ఛిన్నకర ఉద్యమాలు వస్తాయి. అప్పుడు ప్రజలు దానికి బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే మేము సీపీఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, అభివృద్ధిని వికేంద్రీకరించండి.
రాయలసీమ ప్రాంతంలో, వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కడప జిల్లాలో ఊరిస్తూ ఉంది 2007వ సంవత్సరం నుంచి. ఇంతవరకు అగతి లేనటువంటిది. అదేవిధంగా ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతంలో నిమ్స్ కానీ, దొనకొండ పారిశ్రామిక వాడ కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నటువంటి చందంగా తయారైంది. ఉత్తరాంధ్రా ప్రాంతంలో ఉన్నటువంటి విజయనగరం లాంటి జిల్లాల్లో ఫెల్లో ఎరేస్ కంపెనీలు దాదాపు 20 మూతపడిపోయాయి. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కేమో అనుమతులు మంజూరు చేసి వాటికి సొంత గనులు కేటాయిస్తాం అని చెప్పి చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలనే ఎక్కువ కాపాడుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్లుగా ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా విద్యా, వైద్య రంగాల్లో జరుగుతున్నటువంటి వ్యాపారీకరణ ధోరణిని అరికట్టాలి. ఇత్యాది అంశాల పైన పోరాటానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సమతోల్యాభివృద్ధిలో తేడాల పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా పిలుపునిచ్చారు.దేశానికి తిండి పెట్టే రైతు మాత్రం అప్పు రద్దు చేయరు గానీ దేశాన్ని కొల్లగొట్టేటువంటి అదానీ, అంబానీ లాంటి, నీరవ్ మోడీ, సౌరవ్ మోడీ లాంటి వాళ్లకు మాత్రం ₹16,50,000 కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేసి వారి సేవలో ఈ పాలక ప్రభుత్వాలు తరిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగానికి పిలుపునిస్తున్నాం. రైతులంతా కూడా పెద్ద ఎత్తున మీ హక్కుల కోసం మీరు పోరాటానికి సిద్ధం కావాలి. అందుకు జూన్ 30వ తారీకు విజయవాడ కేంద్రం అవుతుంది. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో, కడప జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గారి, చంద్ర సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి, ఎన్ వెంకట శివ, ఎంవి సుబ్బారెడ్డి ,బి వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు