గండ్లూరు వీర ప్రతాప్ రెడ్డి మనవరాలు శ్రియారెడ్డికి జాతీయ స్థాయిలో గుర్తింపు..
–అఖిల భారత కూచిపూడి నృత్య పోటీల్లో తృతీయ స్థానం కైవసం సలాం ప్రొద్దుటూరు: భారతీయ సంప్రదాయ కళ అయిన కూచిపూడి నృత్యంలో తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ప్రొద్దుటూరుకు చెందిన కె. శ్రియారెడ్డి జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. హైదరాబాద్లో నిర్వహించిన అఖిల భారత 25వ దేశవ్యాప్త సాంస్కృతిక నృత్య పోటీల్లో కూచిపూడి సోలో సీనియర్ విభాగంలో తృతీయ స్థానం సాధించి విజేతగా నిలిచారు. నవంబర్ 18, 2026న హైదరాబాద్లోని బషీర్బాగ్ భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఈ ప్రతిష్ఠాత్మక నృత్య పోటీలు...