SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 12:08 pm Posted by : SALAM PRODDATUR

కో-ఆప్షన్ శంకర్‌రావు కు కౌన్సిలర్లు ఆరిఫ్, ముజాహిద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

 

 

సలాం   ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడిగా రిటైర్డ్ ఎస్‌ఐ శంకర్‌రావును నియమిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ వైఎస్ ఆరిఫ్, 20వ వార్డు కౌన్సిలర్ వైఎస్ ముజాహిద్దీన్ ఆధ్వర్యంలో రెండు వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిటైర్డ్ ఎస్‌ఐ శంకర్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం శంకర్‌రావుకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 19, 20వ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శంకర్‌రావుకు అభినందనలు తెలియజేశారు.